సిద్దిపేటలో ఐటీటవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

CM KCR Lays Foundation Stone For IT Tower At Duddeda Village In Siddipet District,CM KCR Lays Foundation Stone For IT Tower In Siddipet,IT Tower,CM KCR,Lays Foundation Stone,Duddeda,Duddeda Village,Siddipet District,CM KCR Lays Foundation Stone,CM KCR Lays Foundation Stone For IT Tower,Mango News,Mango News Telugu,CM KCR,KCR Latest News,KCR Press Meet,KCR Live,KCR Siddipet Tour,KCR speech,Telangana CM KCR,TRS Latest News,telangana news,Minister Harish Rao,Siddipet News,Harish Rao Latest News,KCR Latest Speech,IT Tower,Siddipet,IT Tower In Siddipet,Telangana Govt

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం నాడు తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న సిద్ధిపేట క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భవిష్యత్‌లో సిద్ధిపేట జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని, ఐటీ రంగంలో కూడా సిద్ధిపేట పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.

ఇటీవలే సిద్దిపేట జిల్లాకు ఐటీ ట‌వ‌ర్‌ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది. కొండ‌పాక మండ‌లం దుద్దెడ గ్రామంలో రూ.45 కోట్ల‌తో 60 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ ట‌వ‌ర్‌ను నిర్మించ‌నున్నారు. ఈ ఐటీ టవర్ ద్వారా సుమారు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =