ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Arvind Kejriwal Wishes PM, Birthday Wishes To PM Modi, happy birthday modi, happy birthday modi ji, happy birthday narendra modi, Narendra Modi Birthday, Narendra Modi Birthday LIVE Updates, pm modi birthday wishes, PM Modi Turns 70, PM Narendra Modi Birthday, PM Narendra Modi Turns 70

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 70 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా “సేవా సప్తా” కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. కోవిడ్ బాధితులకు ప్లాస్మా డొనేషన్, దివ్యాంగులకు ఆర్టిఫిషల్ లింబ్స్, ఇతర ఎక్విప్మెంట్స్ అందించడం, హాస్పిటల్స్ లో పండ్లు పంచడం, పేదప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు సహా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.