మొన్న సారా టెండూల్కర్ .. ఇప్పుడు సచిన్ టెండూల్కర్

Deep Fake Video is Bad for Celebrities,Deep Fake Video is Bad,Bad for Celebrities,fake video is bad for celebrities, Sachin Tendulkar, Sachin Tendulkar Deep fake video, Sara Tendulkar,Deepfake videos are creating real problems,Mango News,Mango News Telugu,Viral Deepfake Videos ,Real problems for celebrities,Unveiling Dark Side of AI,Dangers of Deepfakes,Deep Fake Video Latest News,Deep Fake Video Live Updates
Sachin Tendulkar, Sachin Tendulkar Deepfake video,Deep fake video is bad for celebrities,Sara Tendulkar

సెలబ్రెటీలను ఏఐ టెక్నాలజీ వణికిస్తోంది.ఆమధ్య హీరోయిన్ రష్మిక మందన్నా రెండు సార్లు డీప్ ఫేక్ వీడియో బారిన పడగా..ఆ తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలను అది వదలలేదు. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడటంతో  ఆ వీడియో వైరల్ అవుతోంది. దీంతో గతంలో సారా టెండూల్కర్ ఫేక్ వీడియో కూడా వైరల్ అవడాన్ని నెటిజన్లు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

దీంతో ఏఐ టెక్నాలజీ పేరు చెబితే చాలు సెలబ్రెటీలు భయపడిపోతున్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంతో రేపు ఇంకే సెలబ్రెటీ దీని బారిన పడతారా అని టెన్షన్ పడుతున్నారు. ఆ మధ్య  రష్మిక మందన్నా సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్‌ అవడం దీనిపై అమితాబ్ వంటి దిగ్గజ సెలబ్రెటీలు కూడా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అది సద్దు మణిగిందని అనుకునేలోపు మళ్లీ రష్మికతో మరి కొందరు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ అందరినీ షాక్ కొట్టించాయి. తాజాగా ఈ లిస్టులోకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోవడంతో అంతా కంగుతింటున్నారు.

ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ టెండూల్కర్ ప్రచారం చేస్తున్నట్లుగా డీప్ ఫేక్ వీడియో సృష్టించిన కన్నింగ్ ఫెలోయ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీన్ని చూసిన సచిన్ టెండూల్కర్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. తాను బాధితుడిగా మారిన  తన డీప్ ఫేక్ వీడియోను ఎక్స్ ప్లాట్ఫామ్‌లో షేర్ చేసి.. ఇలా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ వీడియో నకిలీవని చెప్పిన సచిన్.. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కనిపించినా వెంటనే సైబర్ పోలీసులకు  ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి వాటిపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని సచిన్ కోరారు. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌ అనే గేమింగ్‌ యాప్‌ను.. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రమోట్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అందులో ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా వేగంగా సంపాదించవచ్చో సచిన్ వివరిస్తున్నట్లుగా ఉంది. అయితే గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సారా టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో అప్పట్లో సోషల్  మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆమె తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌తో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసిన కొంతమంది ఫేక్ గాళ్లు… అర్జున్ పేస్ స్థానంలో గిల్ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =