కార్గిల్ లో సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్న ప్రధాని మోదీ

PM Narendra Modi Went to Kargil to Celebrate Diwali with Soldiers, PM Narendra Modi, PM Narendra Modi Went to Kargil, Narendra Modi Went to Kargil to Diwali, Mango News, Mango News Telugu, Narendra Modi Latest News And Updates, Modi Celebrate Diwali with Soldiers, Modi Celebrate Diwali, Modi Celebrate Diwali With Soldiers, Modi Celebrate Diwali News And Live Updates, Narendra Modi, Narendra Modi Celebrate Diwali, Indian Prime Minister

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ సోమవారం ఉదయం కార్గిల్ చేరుకున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ, “ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌లో అడుగుపెట్టారు, అక్కడ మన వీర సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటారు” అని పేర్కొంది. అనంతరం కార్గిల్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దీపావళి అంటే ఉగ్రవాద ముగింపు పండుగని మరియు కార్గిల్ దానిని సాధ్యం చేసిందని అన్నారు.

మీరంతా ఎన్నో ఏళ్లుగా నా కుటుంబం. కార్గిల్‌లో మన వీర జవాన్లతో దీపావళిని గడపడం విశేషమని సైనికులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. దేశ భద్రతకు సైనిక బలగాలే ధైర్యంతో కూడిన పిల్లర్స్ అని, ఈ కార్గిల్‌ విజయభూమి నుంచి దేశప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.

మరోవైపు సోమవారం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ప్రకాశంతో ముడిపడి ఉంది. ఈ పవిత్రమైన పండుగ మన జీవితాల్లో సంతోషం మరియు శ్రేయస్సు యొక్క స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని కోరుకుంటున్నాను. మీరు కుటుంబం మరియు స్నేహితులతో అద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY