రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ

President Ramnath Kovind Undergoes Bypass Surgery at AIIMS today, His Health is Stable

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు ఎయిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. “రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు (మార్చి 30, మంగళవారం ) ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ విజయవంతమైంది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది మరియు ఆయన సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

ముందుగా‌ ఛాతీలో అసౌకర్యం కారణంగా మార్చి 26, శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలోరాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేరారు. అనంతరం తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ లో వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి బైపాస్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ