ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఫిక్స్

Prime Minister Narendra Modis US Tour Fix

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ట్ ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా..తాజాగా భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫోన్‌ చేశారు. ఈ ఫోన్‌ సంభాషణలో ఇద్దరి మధ్య పలు విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత లోతుగా చర్చించడానికి త్వరలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు.. వైట్ హౌస్ కీలక ప్రకటన కూడా చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి నెలలో అమెరికాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వెల్లడించారు. ట్రంప్‌కి పీఎం మోదీ ఫోన్‌కాల్‌ చేసిన తర్వాత, ట్రంప్ మోదీ పర్యటన విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌కి జనవరి 27న ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

ముందుగా ట్రంప్‌నకు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను చేపట్టినందుకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ..రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరిత భాగస్వామ్యానికి- భారత్‌ కట్టుబడి ఉందని ట్రంప్‌నకు తెలిపారు . భారతదేశం-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలసి మనం పనిచేద్దామని నరేంద్ర మోదీ.. ట్రంప్‌నకు వివరించారు.

అనంతరం మోదీ, ట్రంప్‌ చర్చలపై వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది.భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్‌కాల్‌లో చర్చ జరిగినట్లు తెలిపింది. అలాగే రెండుదేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్‌, మోదీ మధ్య సుదీర్ఝ చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఈ ప్రకటనలో వివరించింది.

దీంతోపాటు తమ దేశం తయారుచేసిన‌ ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలంటూ కూడా మోదీని ట్రంప్‌ కోరినట్లు చెప్పింది. అలాగే రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది తొలిసారి భారత్‌లో క్వాడ్‌ సదస్సు నిర్వహణపై నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ ఈ ఫోన్‌కాల్‌లో చర్చించినట్లు వైట్‌హౌస్‌ వివరించింది.