కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఈసారి ఎన్నికల్లో 400లకు పైగా స్థానాల్లో గెలుపొందుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కానీ చివరికి 240 స్థానాలకే పరిమితమయిపోయింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరడంలో బీజేపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అటు ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు కూడా మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగానే ఉన్నారు.
దీంతో కేంద్రంలో ఎన్డీయే కూటమి బలహీనంగా ఉందని.. ఎప్పుడైనా కూలిపోవచ్చనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అటు ఇండియా కూటమి నేతలు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలోని కొందరు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారంతా తమతో టచ్‌లోకి వస్తున్నారని సంచలన బాంబ్ పేల్చారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందని అన్నారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం బలహీనంగా ఉండడంతో.. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చని వ్యాఖ్యానించారు. గతంలో విద్వేషాలను వ్యాప్తి చేసి, దాని ఫలితాలను పొందారని.. ఈసారి ప్రజలు ఆ ఆలోచనలను తిరస్కరించారని వెల్లడించారు. ఎటువంటి వివక్షా లేని పరిస్థితులు ఉంటే కచ్చితంగా ఇండియా కూటమి తాజా ఎన్నికల్లో గెలుపొందేదని రాహుల్ గాంధీ వెల్లడించారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడామన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE