ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ‘ఆష్లే బార్టీ’

Ashleigh Barty Beats Danielle Collins To Claim Maiden Australian Open Title,Ashleigh Barty Beats Danielle Collins ,Ash Barty Vs Danielle Collins Australian Open 2022 Final ,Ash Barty Vs Danielle Collins Australian Open 2022, Australian Open 2022 Final , Australian Open 2022 ,Ash Barty Vs Danielle Collins Australian Open 2022 ,Ash Barty Vs Danielle Collins Australian Open 2022 Final Highlights,Australian Open,sport news,mango news,Battling Ashleigh Barty Breaks 44-Year Hoodoo

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2022 విజేతగా ప్రపంచనెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్‌ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం చేసుకుంది. టోర్నీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సొంతగడ్డపై చెలరేగి ఆడింది. ముఖ్యంగా డానియెల్‌ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్‌ ఒక ఏస్‌ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది.

25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌ ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ బార్టీ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ కావడం విశేషం. ఇక యూఎస్‌ ఓపెన్‌ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేసుకోనుంది. ఈ విజయంతో బార్టీ 44 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌ మహిళా ప్లేయర్‌గా బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్‌ ఓనిల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన ఆస్ట్రేలియన్‌ మొదటి మహిళగా నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 6 =