కరోనా వ్యాప్తి, చైనా అంశంలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు

Central Govt, China Issue, India Coronavirus, India Coronavirus News, rahul gandhi, Rahul Gandhi About Coronavirus, Rahul Gandhi Coronavirus, Rahul Gandhi Latest News, Rahul Gandhi Political Updates, Rahul Gandhi Warnings on Corona

దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “దేశంలో కోవిడ్‌-19, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై హెచ్చరిస్తూనే ఉన్నా. వారు పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. విపత్తు ఎలా వచ్చిందో చూశాం. ఇప్పుడు చైనా విషయంలోనూ వారిని హెచ్చరిస్తూనే ఉన్నాను. వారు వినిపించుకోవడం లేదని” రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.

ఇప్పటికే కరోనా వ్యాప్తిపై రాహుల్ గాంధీ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు. చైనా సరిహద్దు వివాదంపై కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ కొన్ని రోజులుగా వీడియోలను షేర్‌ చేస్తున్నారు. మరోవైపు దేశంలో జూలై 24, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,287,945 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకుని 817,209 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 440,135 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 30,601 కి చేరింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here