
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వేకు..ప్రపంచంలోనే నాలుగో రవాణా వ్యవస్థగా కూడా పేరుంది. తాజాగా ట్రైన్స్‌లో ప్రయాణీలు నిద్రించే సమయంపై రైల్వేశాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కొత్త రూల్ ప్రకారం, ట్రైన్‌లో ప్రయాణికుల పడుకునే సమయం ఇదివరకటితో పోలిస్తే తగ్గిందనే చెప్పాలి.
ప్రయాణీకులు ఇంతకుముందు తమ ప్రయాణ సమయంలో 9 గంటల పాటు పడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని రైల్వే శాఖ 8 గంటలకు తగ్గించింది. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం.. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలి. గతంలో అయితే ఈ సమయం ఒక గంట ముందే అంటే.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది.
స్లీపర్ క్లాస్ ట్రైన్స్‌లో రైల్వే శాఖ కొత్తగా ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది. ఎక్కువ దూరం జర్నీ చేసే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి రైల్వేశాఖ ఈ మార్పు చేసింది. ఉదయం 10 నుంచి 6 గంటల మధ్య పడుకునే సమయమే మంచి నిద్రకు మేలని అంతా భావిస్తారు. అందుకే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ముందు మిడిల్ బెర్త్‌లపై కూర్చున్నవారు ఎర్లీగా నిద్రపోతారని అంతేకాకుండా తెల్లవారుజాము వరకు నిద్రపోతున్నారని ప్రయాణీకుల నుంచి రైల్వే శాఖకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కింది సీట్లో కూర్చున్నవారికి, కింద సీట్లో ఎక్కువ సేపు నిద్రపోతే పై బెర్తులో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
దీనిపై చాలాసార్లు ప్రయాణికుల మధ్య వాగ్వాదం కూడా జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త నిబంధన వల్ల ప్రయాణీకులు ఇకపై ఇబ్బందులు పడకుండా ఉంటారని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పుడు నిద్రపోయే సమయాన్ని రైల్వే నిర్ణయించడంతో.. ఇకపై ప్రయాణికులు ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్ర పోవాలి తప్ప అంతకు మించి పడుకోకూడదు.
ఉదయం 6 గంటల తర్వాత సీటును అందరూ వాడుకునే విధంగా దించేసి లోయర్ బెర్తుకు వచ్చేయాలి. ఒకవేళ అలా ఎవరైనా చేయకపోతే..వారి ఫిర్యాదుతో రైల్వే అధికారులు ఎక్కువ సమయం నిద్రపోయేవారిపై చర్యలు తీసుకోవచ్చు. మొత్తంగా కొత్త నిబంధన ప్రకారం, ప్రయాణీకులు ఈ కొత్త నిబంధనను ఉల్లంఘిస్తే, రైల్వే అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE