అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో తన స్నేహితుడు, ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు ఎలోన్ మస్క్ పాత్ర కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ దోస్తానీతో మస్క్ కు భారీగా కలసి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసరి రోజే అమెరికన్ స్టాక్ మార్కెట్ తెరవకముందే ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు పెరిగాయి. టెస్లా షేర్లు $8.60 వద్ద వర్తకం చేయబడ్డాయి లేదా 3.54 శాతం పెరుగుదలతో 251.44 డాలర్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇప్పుడు ప్రీ మార్కెట్లో ఇది 31.17 డాలర్లు, 12.40% శాతం లాభపడి 282.61 వద్ద ట్రేడవుతోంది.
డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దుత
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని డ్యాన్సులు కూడా చేశారు. విజయం ఖాయంగా కనిపిస్తున్నందున, ప్రభుత్వ సామర్థ్య కమిషన్‌కు నాయకత్వం వహించేందుకు ఎలోన్ మస్క్‌ను నియమించాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ట్రంప్ ఎలాన్ మస్క్‌ను తన వద్ద ఉంచుకోవాలనుకుంటున్నారు. ఎలోన్ మస్క్ ప్రభుత్వ సలహాదారుగా ననియమిస్తే అవకాశం కనిపిస్తోంది.
ఎలోన్ మస్క్ ప్రసంగిస్తూ, “మాకు కొత్త స్టార్ ఉంది. కొత్త నక్షత్రం పుట్టింది’’ అని కొనియాడారు. ఎలోన్ మస్క్ యొక్క సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, ట్రంప్, “అతను ఒక అద్భుతమైన వ్యక్తి. మేము ఈ రాత్రి కలిసి కూర్చోబోతున్నాము. మీకు తెలుసా, అతను ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా మొదలైన వాటిలో రెండు వారాల పాటు ప్రచారం చేసాడు అని కొనియాడాడు.
ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ మనవరాలు కై ట్రంప్ ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దానిలో మస్క్ కూడా ఉండటంతో ఆయనకు ట్రంప్ ఉన్న స్నేహానికి మించిన అనుబంధం ఉందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కుటుంబసభ్యుడిగా మారిపోయాడన్నారు. కుబేరుడు తన కుమారుడిని ఎత్తుకొని కనిపించారు. మరోవైపు, ఆ పిక్‌లో మెలానియా కనిపించకపోవడం గమనార్హం.