కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు, పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా ఆసుపత్రిలో అడ్మిషన్

Centre Announces COVID-19 Positive Test Report Now Not Mandatory for Admission to Hospital,Coronavirus Cases In India,Coronavirus In India,Coronavirus India Live Updates,Coronavirus Live Updates,COVID-19,Covid-19 In India,Covid-19 Latest Updates,COVID-19 New Live Updates,India Coronavirus,India Covid-19 Updates,Mango News,Mango News Telugu,Coronavirus Updates,Coronavirus Latest News Updates,Coronavirus Live Updates In India,Centre Announces COVID-19 Positive Test Report,COVID-19 Positive Test Report,Positive Test For Covid-19 Not Mandatory For Admission,Covid Positive Report Not Mandatory To Get Hospitalised,Covid Admission New Policy,Covid Positive Report Not Needed For Hospitalisation,Covid Positive Report Not Mandatory,Corona Admission New Policy

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని ప్రకటించారు. కరోనా బాధితులకు సత్వర, సమర్థవంతమైన మరియు సమగ్రమైన చికిత్సను అందించండంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా పేషంట్ల అడ్మిషన్ కు సంబంధించి జాతీయ విధానాన్ని సవరిస్తూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం నాడు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆసుపత్రులు, అలాగే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రైవేటు ఆసుపత్రులు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు ఇవే:

  • కరోనా ఆరోగ్య సదుపాయం కోసం ఆసుపత్రుల్లో చేరేందుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదు. అనుమానిత కేసును వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలి.
  • ఏ రోగికి అయినా ఏ సేవలను నిరాకరించకూడదు. రోగి వేరే నగరానికి చెందినప్పటికీ ఆక్సిజన్ లేదా అవసరమైన మందులను అందించాలి.
  • ఆసుపత్రి ఉన్న నగరానికి చెందిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును బాధితులు సమర్పించలేక పోయినప్పటికీ వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించకూడదు.
  • ఆసుపత్రుల్లో ప్రవేశాలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టే ఉండాలి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వ్యక్తులచే బెడ్స్ ఆక్రమించబడకుండా చూసుకోవాలి.
  • అలాగే కేంద్రం సవరించిన డిశ్చార్జ్ పాలసీలకు అనుగుణంగా అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 15 =