షాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ..

Shayaji Shindes Political Entry | Mango News Telugu

ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేశారు. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఆయన ఎన్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ స్వయంగా షాయాజీ షిండేకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షిండేకి తగిన ప్రాధాన్యం కలిస్పామంటూ పవార్ మాటిచ్చారు.

ఎన్నికల్లో పోటీకి చేయనున్నారా..?
మరో కోన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2021 శాసన సభ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ శివసేన, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని కొలువుదీర్చింది. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ తరుణంలో షాయాజీ షిండే పోటీ చేసే అవకాశం ఉందనే రూమర్స్ గట్టిగానే వినిపించాయి. అయితే రాబోయే ఎన్నికల్లో షిండేకి టికెట్ ఇస్తారా అనేదానిపై పవార్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ పార్టీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా షిండే ఉంటారని మాత్రం పేర్కొన్నారు.

ఇక తన పొలికిటల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు షిండే. నేను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించాను. ఇక నిజంగా రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉంది. అజిత్‌ పవార్‌ నాయకత్వం, నడవడిక నన్ను బాగా ఆకర్షించాయి. అందుకే ఎన్‌సీపీలో చేరాను. ఆయన నాయకత్వంలో సమవర్థవంతంగా పని చేసేందుకే పార్టీలో చేరాను.. అంటూ షిండే చెప్పారు. ఇక షాయాజీ షిండే ఇటీవల బిగ్‌బాస్ తెలుగు షోకి గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై చెట్లు నాటడంపై తన ఆలోచనలను షిండే పంచుకున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఈ విషయంపై కలవాలనుకుంటున్నట్లు కూడా షిండే చెప్పారు. ఇది జరిగిన రెండు రోజులకే జనసేనాని పవన్ కళ్యాణ్‌ను షిండే కలిశారు. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకే షిండే పొలికిటల్ ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం.