ముంబైలో 144 సెక్షన్ అమలుకు నిర్ణయం – ఒమిక్రాన్ ఎఫెక్ట్

144 Section Imposed In Mumbai Due To Omicron Effect,Mango News,Mango News Telugu,144 Section Imposed In Mumbai,Omicron,Omicron Latest News,Maharashtra: Section 144 imposed in Mumbai for two days over Omicron scare,Mumbai: Section 144 imposed to prevent large gatherings amid omicron scare,Maharashtra Lockdown: Mumbai Imposes Fresh Restrictions - Bans Large Gatherings For 2 Days Due to Omicron,Maharashtra Latest News,Maharashtra Lockdown Updates,Mumbai Lockdown News

మహారాష్ట్ర లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 7 కేసులు నమోదవడం, అందులో 3 సంవత్సరాల చిన్నారి కూడా ఉండటం మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న ముంబైలో 2 రోజులపాటు 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకుంది. శనివారం మరియు ఆదివారం 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ మేరకు డిప్యూటీ కమీషనర్ ఆదేశాలు జరీ చేసారు.

ప్రజలు ఎవరూ గుంపులుగా రోడ్లమీదకు రాకూడదు అని స్పష్టం చేసారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలపై కూడా నిషేధం విధించారు. పోలీసులు 144 సెక్షన్ కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడైనా ఆదేశాల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించింది. భారత్ లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు 32 కి చేరుకున్నాయి. వాటిలో మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదయ్యాయి. ముంబైలో వెలుగు చూసిన కేసుల్లో 3 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఒమిక్రాన్ వేరియెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలుపరుస్తోంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 2 =