శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఊరట లభించింది. బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన సహాయకుడు ప్రవీణ్ రౌత్ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు అనుమతించింది. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గ నేత అయిన సంజయ్ రౌత్ ముంబైలోని ఉత్తర శివారులోని పునరాభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 1వ తేదీన వీరిద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అప్పటినుంచి 102 రోజులుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న తరుణంలో రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనమైంది. రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఈడీని ప్రయోగించి వేధిస్తోందని అరెస్ట్ సందర్భంగా సంజయ్ రౌత్ ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE