కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ శెట్టి వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేతగా నిలిచింది. జూలై 3, ఆదివారం రాత్రి ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫెమినా మిస్ ఇండియా 2022 ఫైనల్ పోటీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ పోటీలో సినీ శెట్టి విజేతగా నిలిచి మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సినీ శెట్టికి అభినందనలు తెలియజేశారు.
ఇక రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ మిస్ ఇండియా 2022 మొదటి రన్నరప్ గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ రెండవ రన్నరప్ గా నిలిచింది. ఈ ఏడాది మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో ప్రముఖ నటి నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ మరియు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఉన్నారు. మరోవైపు మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం దక్కించుకున్న సినీ శెట్టి, 71వ మిస్ వరల్డ్ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY