సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం.. అగ్నిపథ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చేవారం విచారణ

Supreme Court Agrees To Hear Pleas Challenging The Agnipath Scheme on Next Week, SC Agrees To Hear Pleas Challenging The Agnipath Scheme on Next Week, Pleas Challenging The Agnipath Scheme on Next Week, Agnipath Scheme Pleas Challenging, Supreme Court, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protest, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. వేసవి సెలవుల తర్వాత తిరిగి తెరవబడిన సుప్రీం కోర్ట్.. తగిన బెంచ్ ముందు పిటిషన్లను వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ ఇందిరా బెనర్జీ మరియు జెకె మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది. ఒక న్యాయవాది ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యర్థులు దీనికోసం శిక్షణ పొందారని, మరియు అపాయింట్‌మెంట్ లెటర్‌ల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన కోర్టుకి వెల్లడించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి కెరీర్ 20 సంవత్సరాల నుండి నాలుగేళ్లకు తగ్గించబడుతుందని సదరు లాయర్ తెలిపారు. ఇది కొన్ని వేల మంది భవిష్యత్తుకి సంబంధించిన అంశమని, దీనిపై సత్వరమే విచారణ చేపట్టాలని ఆయన అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వచ్చేవారంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కాగా మరోవైపు, రక్షణ బలగాల కోసం ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం వాదనలు వినిపించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ 21న సుప్రీంకోర్టులో కేవియట్ దరఖాస్తును దాఖలు చేయడం గమనార్హం. ఒక వ్యాజ్యంపై వాదనలు వినకుండా ఎవరికీ వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల ఆదేశాలు జారీ చేయబడకుండా చూసుకోవడానికే ఈ కేవియట్ అప్లికేషన్ దాఖలు చేయబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =