దేశంలో 11717 బ్లాక్ ఫంగస్ కేసులు, మరో 29250 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు

11717 Black Fungus Cases Reported In India, Black Fungus, Black Fungus Cases, Black Fungus Cases In India, Black Fungus Disease, Black Fungus Infections, Black Fungus New Cases, Black Fungus Treatment, Increasing Cases Of Black Fungus, Increasing Cases Of Black Fungus In Telangana, India, Mango News, Mucormycosis, So Far 11717 Black Fungus Cases Reported, So Far 11717 Black Fungus Cases Reported In India

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 25, మంగళవారం 9:36 గంటల వరకు దేశంలో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం అత్యధికంగా గుజరాత్ లో 2859, మహారాష్ట్రలో 2770, ఆంధ్రప్రదేశ్ లో 768, మధ్యప్రదేశ్ లో 752, ఉత్తరప్రదేశ్ లో 701 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రాల వారీగా చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ఆధారంగా అదనంగా మరో 29,250 అంఫోటెరిసిన్-బి వయల్స్ ను కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ్ వెల్లడించారు. ఆయా రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు మరియు కేటాయింపుల వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి చికిత్సలో యాంటీ ఫంగల్ ఔషధమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ ను కీలకంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897 ప్రకారం మ్యూకోర్ మైకోసిస్ వ్యాధిని నోటిఫై చేయాలని మే 20న కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. అనుమానిత మరియు నిర్ధారించబడిన మ్యూకోర్ మైకోసిస్ కేసులను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైవలెన్స్ ప్రోగ్రాంకు నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ