ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల, జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు

Mango News Telugu, Telangana Inter 2021, Telangana Inter Board, Telangana Inter Board Released First Phase Admission Schedule, Telangana Inter Board Released First Phase Admission Schedule for Academic Year 2021-22, Telangana Intermediate admissions, TS Inter 1st Year Admission 2021 schedule, TS Inter Admissions 2021-22, TS Intermediate Registration Form 2021, TSBIE announces admission schedule, TSBIE schedule for intermediate admissions

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల మొదటివిడత షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం దరఖాస్తు పత్రాల జారీ, ప్రవేశాలను మే 25వ తేదీన ప్రారంభించామని, ప్రవేశాల ప్రక్రియను జూలై 5వ తేదీతో పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సు కోసం ఆన్‌లైన్ తరగతులు జూన్ 1 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇక 2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ప్రభుత్వ/ప్రైవేట్ ఎయిడెడ్/ప్రైవేట్ అన్-ఎయిడెడ్/కోఆపరేటివ్/టిఎస్ రెసిడెన్షియల్/సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్/సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్/ఇన్సెంటివ్/మైనారిటీ/కెజిబివి/టిఎస్ మోడల్ జూనియర్ కళాశాలలు మరియు జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సును అందించే కంపోజిట్ డిగ్రీ కళాశాలలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థులుకు వారు చదివిన పాఠశాలల నుంచి అసలైన ఎస్‌ఎస్‌సి పాస్ సర్టిఫికేట్ మరియు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్‌ (టీసీ) అందిన తర్వాత తాత్కాలిక ప్రవేశాలు ధృవీకరించబడతాయని చెప్పారు. రెండవ దశ ప్రవేశాల షెడ్యూల్ నిర్ణీతసమయంలో ప్రకటించబడుతుందన్నారు. ఇక acadtsbie.cgg.gov.in మరియు tsbie.cgg.gov.in పొందుపరిచిన అనుబంధ కళాశాలలోనే ప్రవేశాలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు విద్యార్ధులుకు ఇంటర్ బోర్డు సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =