చిరంజీవి ఛారిటబుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవలు ప్రారంభం

Chiranjeevi, Chiranjeevi announces oxygen banks in various districts, Chiranjeevi launches oxygen banks in Andhra Pradesh, Chiranjeevi opens oxygen bank, Chiranjeevi Oxygen Banks, Chiranjeevi Oxygen Banks To Start in Anantapur, Chiranjeevi Oxygen Banks To Start in Anantapur and Guntur Districts, Guntur Districts, Mango News, Megastar Chiranjeevi launches Oxygen Banks, Megastar’s Oxygen Banks Mission Begins, Oxygen Banks, Ram Charan to launch oxygen banks

దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో తనవంతుగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ లను ఏర్పాటు చేస్తునట్టు ఇటీవలే ప్రకటించారు. కాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 26, బుధవారం నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లా కేంద్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. అనుకున్న ప్రకారం వారం రోజులలోపు వందల కొద్దీ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేట‌ర్స్‌ కూడా సేకరించామని చిరంజీవి తెలిపారు. మొదటివిడతగా వీటిని అనంతపూర్, గుంటూరు జిల్లాలకు పంపిస్తున్నామని, ఇక రేపటినుంచి వరుసగా ఇతర జిల్లాలకు కూడా పంపించడం జరుగుతుందన్నారు.

యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేట‌ర్స్‌ సేకరణ చేస్తున్నామని, ఇందుకోసం రామ్ చరణ్ ప్రత్యేక దృష్టి సారించి కృషి చేస్తున్నారని చిరంజీవి చెప్పారు. నేటి నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్ సేవలు వినియోగంలోకి రాగా, రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక సమయానికి ఆక్సిజన్ దొరక్క ఎవరు ఇబ్బందిపడకూడదని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − 1 =