శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబికడంతో మరోసారి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోవడం, ఆయన రాజీనామా చేయలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక ఎమర్జెన్సీ/అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు శ్రీలంక ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. శ్రీలంక అధ్యక్షుడు దేశం వెలుపల ఉన్నందున, దేశంలోని పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎమర్జెన్సీ ప్రకటించబడిందని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి సైనిక విమానంలో మాల్దీవులకు పారిపోయారు.
ఈ ఘటన తర్వాత శ్రీలంకలో నిరసనకారులు మళ్ళీ తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. శ్రీలంక ప్రధాని కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాజీనామా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొలంబోలో మళ్లీ నిరసనలు చెలరేగడంతో శ్రీలంక ప్రధాని నివాసం వద్ద భారీగా సైనిక బలగాలు మోహరింపజేశారు. మరోవైపు అధ్యక్షుడు రాజపక్సే దేశం విడిచివెళ్లడంతో శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించినట్టు స్పీకర్ మహింద అభయవర్ధన ప్రకటించారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తన పదవీకి రాజీనామా చేస్తారా? లేదా అనే అంశంపై చర్చ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































