సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: నటి రియా చక్రవర్తిపై అభియోగాలు దాఖలు చేసిన ఎన్‌సీబీ

NCB Charges Actress Rhea Chakraborty In Drugs Case Involving Sushant Rajput, Actress Rhea Chakraborty In Drugs Case Involving Sushant Rajput, NCB Charges Actress Rhea Chakraborty In Drugs Case, Actor Rhea Chakraborty was charged for buying narcotics for her actor-boyfriend Sushant Singh Rajput, actor-boyfriend Sushant Singh Rajput, actor Sushant Singh Rajput, Sushant Singh Rajput, NCB Charges Actress Rhea Chakraborty, Actress Rhea Chakraborty, Rhea Chakraborty, Actor Rhea Chakraborty Charged In Drugs Case, Sushant Singh death Case, Narcotics Control Bureau, Sushant Singh death Case News, Sushant Singh death Case Latest News, Sushant Singh death Case Latest Updates, Sushant Singh death Case Live Updates, Mango News, Mango News Telugu,

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్ ‌బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తిపై ఎన్‌సీబీ అభియోగాలు మోపింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం రియా చక్రవర్తి నిషిద్ధ పదార్ధాలను సేకరించిందని, అతని మాదకద్రవ్యాల వ్యసనాన్ని ఆమె ప్రోత్సహించిందని ఎన్‌సీబీ అభియోగాల్లో పేర్కొంది. రియా చక్రవర్తి శామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి సహా ఇతరుల నుండి అనేక నిషిద్ధ పదార్ధాల డెలివరీలను అందుకుని, ఆ డెలివరీలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కు అందజేసినట్టు పేర్కొన్నారు. సుశాంత్‌ మరణంతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుపై దర్యాప్తులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ సహా మొత్తం 35 మందిపై ఎన్‌సీబీ అభియోగాలను మోపింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద ఎన్‌సీబీ ప్రత్యేక కోర్టుకు ముసాయిదా అభియోగాలు/ఛార్జ్ షీట్ అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో రియా చక్రవర్తి దోషిగా తేలితే ఆమెకు పదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ముందుగా జూన్ 14, 2020న ముంబయిలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందారు. ఈ కేసులో డ్రగ్స్ సంబంధిత ఆరోపణలు రావడంతో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8, 2020న ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా విచారణ జరపగా, ఆమె దాదాపు నెల రోజులపాటు బైకుల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. పలుమార్లు ఆమె బెయిల్ పిటిషన్ ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. అయితే ఎట్టకేలకు అక్టోబర్‌ 7, 2020న రియాచక్రవర్తికి బెయిల్ మంజూరు చేస్తునట్టు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. తాజాగా ఆమెపై ఎన్‌సీబీ అభియోగాలు మోపడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =