ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంలో షాక్.. జైలు నుంచి విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే

Supreme Court Suspends Bombay High Court Orders of Releasing Prof GN Saibaba and Others in UAPA Case, Bombay High Court Orders of Releasing Prof GN Saibaba and Others in UAPA Case, Prof GN Saibaba and Others in UAPA Case, UAPA Case, Supreme Court Suspends Bombay High Court Orders, Bombay High Court Orders, Supreme Court, Prof GN Saibaba, The Unlawful Activities, UAPA Case News, UAPA Case Latest News And Updates, UAPA Case Live Updates, Mango News, Mango News Telugu

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనతో పాటు మరో నలుగురు నిర్దోషులని, బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో అత్యవసరంగా విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.

ఇక ఈ కేసులో సాయిబాబా నిర్దోషి అని నాగపూర్‌ బెంచ్‌ తీర్పును ఇచ్చిన నేపథ్యంలో.. క్రిమినల్‌ ప్రొసీజర్‌లోని 390 కోడ్‌ ప్రకారం వ్యతిరేకిస్తున్నట్లు బెంచ్‌ పేర్కొంది. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఉండే ఈ నేరాలు చాలా తీవ్రమైనవి, సాక్ష్యాధారాలను సవివరంగా పరిశీలించిన తర్వాతే నిందితులను దోషులుగా నిర్ధారించామని కోర్ట్ పేర్కొంది. హైకోర్టు కేసులోని మెరిట్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. ఇతర సాంకేతిక కారణాలు చూపి నిందితులను విడుదల చేసింది. డిసెంబర్‌ 8వ తేదీన దీనిపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. కాగా మావోయిస్టు లింక్ కేసులో గత ఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న సాయిబాబాను విడుదల చేయాలని బాంబే హైకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY