గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు

Visakha Garjana Highlights Chorus For 3 Capitals Intensifies as YSRCP Backs Rally Ministers and MLAs Attends, 3 Capitals Intensifies as YSRCP Backs Rally Ministers and MLAs Attends, Visakha Garjana Highlights Chorus For 3 Capitals, Visakha Garjana Highlights, 3 Capitals, Visakha Garjana rally on October 15, Visakhapatnam, Visakha Garjana Rally News, Visakha Garjana Rally Latest News And Updates, Visakha Garjana Rally Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ‘విశాఖ గర్జన‘ పేరుతో నేడు వైజాగ్‌లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మేరకు అధికార వైఎస్సార్సీపీ మద్దతుతో ఈ ర్యాలీని సక్సెస్ చేశామని జేఏసీ ప్రకటించింది. ఒకవైపు జోరున వర్షం పడుతున్నా ప్రజలు భారీగా హాజరయ్యారని, విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని నిర్మించడానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. దాదాపు లక్ష మందికి పైగా జనం హాజరయ్యారని జేఏసీ అంచనా వేస్తోంది. కాగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

మూడు రాజధానులపై ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ తమ్మినేని సీతారాం: నిరక్షరాస్యత, నిరుద్యోగం, కరువు.. ఇలా ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైంది, భవిష్యత్ తరాల కోసమే ఈ పోరాటం.

మంత్రి ఆర్కే రోజా: మూడు రాజధానులతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఉత్తరాంధ్రలో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నందున ఇక్కడి ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావం తెలపాలి.

మంత్రి గుడివాడ అమరనాథ్: విశాఖ గర్జన భయంతో టీడీపీ-జనసేన పార్టీలకు ఇప్పుడు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని ఉత్తరాంధ్ర విజనతతో వ్యవహరించి సద్వినియోగం చేసుకోవాలి.

మంత్రి విడదల రజిని: 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి. అందరూ బాగుండాలి, అందరికీ సమాన అవకాశాలు కలగాలి.

మాజీ మంత్రి కొడాలి నాని: రాష్ట్రంలోని అన్ని ప్రణతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం. ఇన్నాళ్లుగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయడానికే విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి: పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి ఈ ర్యాలీ ద్వారా కనువిప్పు కలగాలి. ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుకు పార్టీలకతీతంగా ప్రజలందరూ మద్దతు తెలపాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + one =