ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: 9 గంటల సీబీఐ విచారణలో 56 ప్రశ్నలు ఎదుర్కొన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్

Delhi Liquor Scam Case CM Arvind Kejriwal Faces 56 Questions In 9-Hours Duration Of CBI Enquiry,Delhi Liquor Scam Case,CM Arvind Kejriwal Faces 56 Questions,CM Arvind Kejriwal Faces 9-Hours Duration Of CBI Enquiry,Kejriwal Faces 56 Questions In 9-Hours Duration,Delhi Liquor Scam Case CBI Enquiry,Mango News,Mango News Telugu,Kejriwal Leaves CBI Office,CBI Asked 56 Questions,Delhi CM Kejriwal'S CBI Questioning,CBI Grilled Me For 9 Hours,Arvind Kejriwal Questioned,His Statements Will Be Verified,Delhi Liquor Scam Case News Today,Delhi Liquor Scam Case Latest News,Delhi Liquor Scam Case Live Updates

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన దాదాపు 9 గంటల సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయట మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ తనను 56 ప్రశ్నలు అడిగిందని, అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈ కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమీ ఇది తమపై ఆరోపించబడిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ నేతల సూచనల మేరకే సీబీఐ నడుచుకుంటోందని, తనను అరెస్ట్ చేయమని కూడా చెప్పే ఉంటుందని సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అంతకుముందు విచారణకు హాజరయ్యే క్రమంలో సీఎం కేజ్రీవాల్ ఆదివారం ఉదయం రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు ఆప్ పార్టీ నేతలు ఆయన వెంట వచ్చారు. అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయాన్ని వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఆప్ నాయకులు మరియు శ్రేణులు దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించారు. దీంతో ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, అతిషి సహా పలువురు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిన అనంతరం నేతలను నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =