దేశ రాజధాని ఢిల్లీ సమీపానికి చేరుకున్న మిడతల దండు

Delhi Environment Minister, Desert Locusts, Locusts Reached to Gurugram and Delhi Outskirts, Swarms Of Desert Locusts, Swarms Of Desert Locusts Reached to Gurugram

దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనాతో పోరాడుతుంటే, మిడతల దండు రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. గత నెలరోజులనుంచి రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి. పంటలను నాశనం చేసే ఈ ఎడారి మిడతల దండు వలన ప్రజలు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌ ప్రాంతానికి మిడతల దండు చేరుకుంది. అలాగే నగరంలోని సైబర్‌ హబ్‌ ప్రాంతమైన డిఎల్‌ఎఫ్ ఫేజ్ 1, సికందర్‌పూర్, సుఖ్రాలి, చక్కర్‌పూర్ లలో మిడతలు ఆకాశాన్ని కమ్మేసి చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ ప్రాంతంలోని మిడతల దండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ సమీపంలో మిడతల దండు దాడి నేపథ్యంలో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా మిడతలు వ్యాపించిన ప్రాంతంలో ప్రజలు కిటికీలు మూసివేయాలని కోరారు. అలాగే మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయడం, పాత్రలను కొట్టడం, పటాకులు కాల్చడం వంటివి చేస్తూ వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయాలనీ సూచించారు. అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం మిడతల దండు పర్యవేక్షణకు స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu