కోవిడ్-19 చికిత్సలో డెక్సామెథసోన్‌ వాడకానికి అనుమతి

Central Govt Approves Use of Dexamethasone Steroid in Covid-19 Treatment

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు మందుల వాడకాన్ని సూచిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల చికిత్సకు తాజా చికిత్సా విధానాన్ని ఈ రోజు ప్రకటించింది. సవరించిన చికిత్స విధానంలో మెథైల్ ప్రెడ్నిసొలోన్ స్థానంలో డెక్సామెథసోన్ ను ప్రత్యామ్నాయంగా వాడవలసిందిగా వైద్యులకు సూచించింది. ఈ మందు వాడకం ద్వారా వచ్చిన ఆధారాలను, నిపుణుల సూచనలను దృష్టిలో ఉంచుకొని ఒక మోస్తరు నుంచి తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి చేసే చికిత్సలో ఈ మందును వాడాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ ఈ తాజా చికిత్సా నియమావళిని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతూ వీటి వాడకం, అందుబాటు తదితర విషయాలలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. సంస్థాగతంగా కూడా డెక్సామెథాసోన్ వాడాలని కోరారు.

వ్యాధినిరోధకత తగ్గినప్పుడు వాడటానికి ఉపయోగపడే డెక్సామెథసోన్ మందు కోవిడ్-19 బాధితులకు కూడా పనికొస్తుందని తెలియటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన కోవిడ్ బాధితుల మీద ఈ మందును ప్రయోగించినప్పుడు సత్వరం కోలుకున్నట్టు నిర్థారణ కావటంతో దాని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉన్నవారిలో మరణాల రేటును బాగా తగ్గించగలిగినట్టు, వెంటిలేటర్ల మీద ఉన్నవారిలో మూడోవంతు మందికి సత్ఫలితాలు ఇచ్చినట్టు గుర్తించారు. అదే విధంగా ఆక్సిజెన్ థెరపీలో ఉన్నవారిలొ ఐదోవంతు మంది కూడా దీనివల్ల కోలుకున్నారు. ఈ మందు జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఉండటం వలన సులభంగా అందుబాటులో కూడా ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =