శరద్‌ పవార్‌ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం

8 Parties Leaders Assembled at NCP Leader Sharad Pawar House in Delhi, All-party meet starts at NCP chief Sharad Pawar’s Delhi, Mango News, Nationalist Congress Party, Nationalist Congress Party Ncp President Sharad Pawar, NCP Leader Sharad Pawar House, Opposition leaders gather at Sharad Pawar’s home, Opposition leaders hold meeting at Pawar’s residence, Opposition leaders meet at Sharad Pawar’s Delhi residence, Pawar hosts oppn leaders, Sharad Pawar hosts meeting of opposition leaders

దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు. టీఎంసీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించడానికి ఈ రాష్ట్ర మంచ్ సమావేశం ఏర్పాటు చేయమని ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కోరినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో టీఎంసీ, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటుగా జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది రాజకీయ సమావేశం కాదని, ఒకే రకమైన వ్యక్తుల మధ్య జరిగిన చర్చ అని సమావేశం అనంతరం నేతలు పేర్కొన్నారు.

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు నేపథ్యంలో ఈ రాష్ట్ర మంచ్ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​ తో ఇటీవలే శరద్ పవార్ రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం నాడు రాష్ట్ర మంచ్ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =