కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1, 2021 తేదీలలో బీచ్‌లు, హోటల్స్, క్లబ్బులు, రిసార్ట్‌లు మరియు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పార్టీలకు అనుమతి లేదని ప్రకటించారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 న నగరంలోని బీచ్‌లలో ప్రజలకు ప్రవేశం ఉండదని పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ఉండడానికే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని, ఎనిమిది నెలల కఠినమైన లాక్ డౌన్ అనంతరం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ