పేజ్-3 ట్రయల్స్ లో ఇప్పటికి 13వేల మంది వాలంటీర్లకు‌ కొవాగ్జిన్‌: భారత్ బయోటెక్

Covaxin Phase-3 Trials Cross Half-way Mark of 13000 Volunteers - Bharat Biotech,Bharat Biotech Covid 19 Vaccine Phase 3 Trials Cross Half Way,Mark Of 13000 Volunteers,Bharat Biotech,Covid-19 Vaccine Phase-3 Trials Cross Half-way Mark Of 13000 Volunteers,Bharat Biotech Enrolment In Covaxin Phase 3 Trial,Bharat Biotech Crosses Halfway Mark Of 13000,Covaxin Crosses Half-way Mark In Phase-3 Trials, Bharat Biotech Latest News,Mango News,Mango News Telugu,13000 Volunteers,Bharat Biotech Covid vaccine,Covaxin clinical trial,Covaxin,Covaxin Phase-3,Coronavirus Vaccine,Covid Vaccine,Coronavirus Vaccine,Bharat Biotech Crosses Half-Way Mark

కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్‌” పేరుతో హైదరాబాద్ కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పురోగతి దిశగా వెళ్తుంది. కొవాగ్జిన్ పేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు నవంబర్‌ లో‌ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ పురోగతిపై మంగళవారం నాడు భారత్ బయోటెక్ ఓ ప్రకటన విడుదల చేసింది.‌ పేజ్-3 క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికి 13వేల మంది వాలంటీర్లకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్ ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో 26 వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా లక్ష్యం నిర్దేశించుకున్నామని, అందులో సగం మేర లక్ష్యం పూర్తిచేసుకుని పురోగతి దిశగా సాగుతున్నట్టు ప్రకటించింది. పేజ్-3 ట్రయల్స్ జరుపుకుంటున్న భారతదేశం యొక్క మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ అని పేర్కొన్నారు. దేశంలో ఏ టీకాకైనా ఇప్పటిదాకా నిర్వహించిన పేజ్-3 సమర్థత ట్రయల్స్ లో ఇదే అతి పెద్దదని తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు భారత్‌ బయోటెక్ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eighteen =