నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు, క్లబ్బులు, బీచ్‌లలో పార్టీలకు అనుమతి లేదు

Tamil Nadu Govt Bans New Year Celebrations On Beaches, Hotels and Clubs,Tamil Nadu Bans New Year's Eve Celebrations At Beaches, Hotels And Clubs,New Year Eve Celebrations At Clubs, Beaches Banned In Tamil Nadu Amid Outbreak,Tamil Nadu Govt Bans Beach Parties,Public Gathering At Beaches For New Year,COVID-19,Tamil Nadu Bans New Year Celebrations On Beaches Roads And At Hotels,Tamil Nadu Bans New Year Celebrations,TN Govt Bans Celebrations On New Year Eve,Tamil Nadu Govt Bans Beach Parties And Celebrations,Tamil Nadu,Tamil Nadu State,Tamil Nadu Govt,Mango News,Mango News Telugu,Coronavirus,Tamil Nadu Bans Gatherings At Beaches,Tamil Nadu Govt Bans New Year Celebrations,COVID-19 Effect,Tamil Nadu Govt Bans New Year Parties,New Year Celebrations 2021

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1, 2021 తేదీలలో బీచ్‌లు, హోట‌ల్స్, క్లబ్బులు, రిసార్ట్‌లు మరియు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి పార్టీల‌కు అనుమ‌తి లేదని ప్రకటించారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 న నగరంలోని బీచ్‌లలో ప్రజలకు ప్రవేశం ఉండదని పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వేడుక‌లు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ఉండడానికే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని, ఎనిమిది నెలల కఠినమైన లాక్ డౌన్ అనంతరం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =