నవంబర్ 16 నుంచి పాఠశాలలు ప్రారంభించే నిర్ణయం నిలిపివేత

Tamil Nadu Govt has Put on Hold Its Decision to Reopen Schools from November 16

కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో దశల వారీగా పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుగా నవంబర్ 16 నుండి 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. అయితే 16 వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు గురువారం నాడు తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జరిపిన సంప్రదింపులలో కరోనా పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడంపై ఎక్కువుగా వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమైందని పేర్కొన్నారు. దీంతో పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేశామని, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మరోసారి సమీక్ష జరిపి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ