రష్యా దండయాత్రకు 50 రోజులు.. పట్టు విడవకుండా పోరాడుతున్న ఉక్రెయిన్

50 Days of Russia Invasion in Ukraine Still War Continues with Missiles Strikes on Kyiv, 50 Days of Russia Invasion in Ukraine, Still War Continues with Missiles Strikes on Kyiv, Russia Ukraine Still War Continues with Missiles Strikes on Kyiv, Russia-Ukraine War Amid Continuous Attacks, Amid Continuous Attacks, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Updates, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన దండయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 24న ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ “ప్రత్యేక సైనిక చర్య” పేరుతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించాడు. అప్పటి నుండి ఈ 50 రోజులలో.. ఉక్రెయిన్‌పై వరుస బాంబుదాడులతో విరుచుకుపడింది రష్యా. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో పదివేల మందిని చంపింది, యుద్ధ భయంతో మిలియన్ల మంది ఉక్రేనియన్లు వలసపోయారు. ఒకప్పుడు శాంతియుత నగరాలగా, ప్రముఖ టూరిస్ట్ నగరాలుగా పేరుగాంచిన ప్రాంతాలు నేడు స్మశాన వాటికలను తలపిస్తున్నాయి. ఎటు చూసినా విరిగి పడిన భవంతులు, యుద్ధ సామగ్రితో వాటిని యుద్ధ ప్రాంతాలుగా మార్చింది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సహాయంగా నాటో దేశాలు ఆయుధాలను, యుద్ధ వాహనాలను అందిస్తున్నారు. దీంతో ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు సవాల్ విసురుతోంది. చిన్న దేశమైనా అసాధారణ పోరాటపటిమ చూపిస్తోంది. నాలుగైదు రోజులలో ఆక్రమించుకోవచ్చులే అనుకున్న రష్యాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ పరిణామంతో అసహనం చెందిన రష్యా రసాయనిక బాంబులతో దాడులు తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ భూభాగంలో ఆయుధాలను రవాణా చేస్తున్న యునైటెడ్ స్టేట్స్ మరియు నాటో వాహనాలను చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా చూస్తామని రష్యా తీవ్రంగా స్పందించింది. మరోవైపు ప్రపంచదేశాలు రష్యాపై కనీవినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా అపఖ్యాతి మూటకట్టుకుంది. యుద్ధంలో తన సైన్యాన్ని కూడా భారీగా కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ మారణహోమం కొనసాగనుందో అని మిగిలిన దేశాలు ఎదురుచూస్తున్నా రష్యా మాత్రం యుద్దాన్ని ఆపటం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =