దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సోమవారం నాడు కొత్తగా 1843 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే 1348 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,504 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 33244 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గత 24 గంటల్లో నమోదైన 44 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 479 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 797 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 25344 కి చేరింది. ప్రస్తుతం 20681 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు జూన్ 19 నుండి 30 వరకు చెన్నైతో సహా కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో మళ్ళీ పూర్తిస్థాయిలో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu