ద్వారకా శారదా పీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

PM Modi Expressed Deep Grief over Passing Away of Dwarka Sharda Peeth Shankaracharya Swami Swaroopanand Saraswati, PM Modi Expressed Deep Grief Swami Swaroopanand Saraswati Demise, Dwarka Sharda Peeth Shankaracharya Swami Swaroopanand Saraswati, Shankaracharya Swami Swaroopanand Saraswati, Dwarka Sharda Peeth, PM Narendra Modi, Mango News , Mango News Telugu, Swami Swaroopanand Saraswati Demise, Swami Swaroopanand Saraswati Latest News And Updates, Swaroopanand Saraswati Died, Indian Prime Minister Narendra Modi

ద్వారకా శారదా పీఠానికి చెందిన​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి (99) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్ నార్సింగ్‌పూర్ జిల్లాలోని పీఠంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఇక నార్సింగ్‌పూర్‌లోని పరమహంసి గంగా ఆశ్రమంలో ఆయన భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని సివానీ జిల్లాలోని దిఘోరి గ్రామంలో జన్మించారు. 9 సంవత్సరాల వయస్సులో ఆయన ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. అనంతరం కాశీలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. అలాగే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా స్వామి పాల్గొన్నారు. 1942లో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వారణాసిలో తొమ్మిది నెలలు మరియు మధ్యప్రదేశ్‌లో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు.

ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో తన ఆలోచనలు ఆయన అనుచరులతో ఉన్నాయని అన్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మరణించారనే విషాద వార్త అందింది. సనాతన సంస్కృతి మరియు మత ప్రచారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన అనుచరులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =