ఆ ఫోన్ హ్యాక్ చేయలేరు.. ట్రాక్ చేయలేరు

phone can't be hacked, phone can't be tracked, mobile phone used by the Prime Minister,Narendra Modi mobile phone

ప్రధాని మోడీ ఆహార్యం , ఆయన అలవాట్లు చాలామందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. వేసుకునే డ్రస్సు నుంచి వాడే ఫోన్,ఇతర వస్తువుల వరకూ ఆయన అన్నిటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.అయితే ఆయన వాడే ఫోన్‌ల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక్కోసారి డిబేట్లు కూడా జరిగిపోతూ ఉంటాయి.

అవును.. నిజమే ఎందుకుంటే ప్రధాని మోడీ ఎప్పుడూ రకరకాల ఫోన్‌లతో కనిపిస్తుంటారు. సాధారణంగా ప్రముఖ రాజకీయవేత్తలు, సెలబ్రెటీలు ఐఫోన్‌ల మోడళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు.అయితే గ్లోబల్ లీడర్‌లకు, భద్రతా కారణాల వల్ల వాళ్లు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి వాళ్లకు అనుమతి ఉండదు. అంతేకాదు వాళ్లు వాడే ఫోన్‌లో కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు కూడా ఉంటాయట.

అలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీఐపీల కోసం స్పెషల్‌గా డిజైన్ చేయించిన శాటిలైట్ లేదా RAX అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్స్ఛేంజ్ మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన.. ప్రత్యేకంగా ఎన్క్రిప్ట్ చేయబడిన నవరత్న PSU మొబైల్ ఫోన్‌ని నరేంద్రమోడీ.. ప్రధాన కార్యదర్శి ద్వారా ఉపయోగిస్తూ ఉంటారు..

భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఫోన్ రూపొందించబడింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే ఎన్‌క్రిప్టెడ్ డివైజ్ ఇది .అంటే దీనిలో ఉండే ప్రత్యేక సాఫ్ట్ వేర్..మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తున్నందు వల్ల.. ఈ ఫోన్‌లు హ్యాక్ చేయాలనుకున్నవారికి కనిపించవు..దీంతో హ్యాక్ కూడా చేయలేరు. దీనిని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఏజెన్సీలు ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తాయి.

త్రీ లెవెల్ ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీని ఉపయోగించి కేవలం.. శాటిలైట్ నంబర్‌లతోనే ప్రధానమంత్రి ఆఫీస్ ఫోన్ ద్వారా ప్రధాని ఫోన్‌కు కాల్స్ చేయబడతాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వాడుతున్న మొబైల్ ఫోన్ పేరు రుద్ర. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రుద్ర ఫోన్‌ను అభివృద్ధి చేసింది.

ఈ మొబైల్‌లో ప్రధాని మంత్రి మోడీభద్రతను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు.. సైబర్ దాడుల నుంచి రక్షించడానికి రుద్ర ఫోన్‌లలో ఇంటర్నల్ సెక్యూరిటీ చిప్‌లు కూడా ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‌తో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఏజెన్సీలు.. మోడీ మొబైల్‌ను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE