సీ ఓటర్ సర్వే ఏం చెప్పింది?

Chandrababu sympathy,Chandrababu, Chandrababu arrest, CVoter, Skill Devolopment Scam,Am Ex Cm

ఏపీ రాష్ట్రంలో IANS కోసం సీ ఓటర్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఆరోపించిన ఆరోపణలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం వల్ల ఓటర్లలో..ఒక్కసారిగా ఆయన పట్ల సానుభూతి పెరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు

సీ ఓటర్ సర్వేలో 1,809 మంది పాల్గొనగా..వారిలో 53 శాతానికి పైగా.. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆయనపై సానుభూతిని పెంచిందని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై.. సీవోటర్ సర్వే ప్రకారం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీ ఓటర్ సర్వేలో కొంతమంది టీడీపీ మద్దతుదారులుగా గుర్తించగా..వారిలో దాదాపు మూడు నుంచి నాల్గవ వంతు మంది చంద్రబాబు అరెస్ట్ పట్ల ఆయనపై ప్రజల సానుభూతిని పెంచేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, విచిత్రంగా బీజేపీ మద్దతుదారులుగా గుర్తించబడిన వాళ్లల్లోకూడా.. మూడింట రెండు వంతుల కంటే తక్కువ మంది కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇందులో గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే, చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులలో ప్రతి పది మందిలో నలుగురు కూడా చంద్రబాబు అరెస్ట్‌తో ఆయనపై ప్రజల్లో సానుభూతిని పెంచిందని ఒప్పుకున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సిమెన్స్‌తో సహా మరి కొన్ని ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం.. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో ఏపీ యువతను ఆదుకునేందుకు తర్వాత ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ స్కిల్ డెవలప్మెంట్‌లో స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ ప్రభుత్వంలో చంద్రబాబు కొన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి సుమారు రూ.200 కోట్లు నొక్కేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =