రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్‌తో పాటు 26 రైళ్లను 47 రోజులపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే .. ప్రయాణికుల డిమాండ్‌తో ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం టూ నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్‌లో మరమ్మత్తు పనులు చేపడుతుండటంతో రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో రద్దు చేసిన రైళ్లలో కొన్ని సర్వీసులను మాత్రం పునరుద్ధరిస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది .. దీంతో ఎప్పటిలాగే కొన్ని సర్వీసులు అందుబాటులోకి ఉంటున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ఏడాదిగా భద్రతా పరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతోనే తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ వచ్చారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులెవరూ పెద్దగా ఇబ్బందులు పడలేదు.కానీ ఇప్పుడు వాటిని కూడా రద్దు చేయడంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెనుకకు తగ్గారు.
ఇక ఎప్పటిలాగే నడవనున్న రైళ్ల విషయానికి వస్తే.. కాకినాడ పోర్ట్ టూ పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్ ప్రెస్, విశాఖ టూ లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్, కాకినాడ పోర్టు నుంచి విజయవాడ మధ్య మెమూ ఎక్స్ ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కానీ రత్నాచల్ , సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రం ప్రకటించిన విధంగానే రద్దు చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE