దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో సెంచరీ చేసిన భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్

Boxing Day Test, india a vs south africa a today match, India vs South Africa, India vs South Africa 1st Test, India vs South Africa 1st Test Day 1 Highlights, India vs South Africa 1st Test KL Rahul Scored Record Century, India vs South Africa Highlights, india vs south africa highlights 2021, India vs South Africa Highlights Day 1, India vs South Africa Live, India vs South Africa Live Score 1st Test, india vs south africa test highlights, india vs south africa test scorecard, KL Rahul Scored Record Century, Mango News, South Africa Vs India

టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 నాటౌట్: 248 బంతుల్లో 16×4, 1×6) దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లపై రాహుల్ రోజు మొత్తం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో తొలి రోజు దక్షిణాఫ్రికాపై భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే కేఎల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన భారత రెండో ఓపెనర్ గా రికార్డులకెక్కాడు. అది కూడా 18 ఏళ్ల తర్వాత సాధించడం గమనార్హం. ఇంతకుముందు మాజీ బ్యాట్సమన్ వసీమ్ జాఫర్ 2007 పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టీమ్ ఇండియా తరపున శతకం (116) బాదిన ఓపెనర్ గా నిలిచాడు.

రాహుల్ ఈ మ్యాచ్ లో శతకం సాధించడం ద్వారా మరో ఘనతను కూడా అందుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాల్లో సెంచరీలు బాదిన బ్యాట్స్ మన్ నిలిచాడు. దీనితోపాటు, పాకిస్థాన్ మాజీ బ్యాట్స్ మన్ సయీద్ అన్వర్, వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తర్వాత.. ఆఫీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ బ్యాట్సమన్ గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, తొలి రోజు ఆటోలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60; 123 బంతుల్లో 9×4)తో కలిసి తొలి వికెట్ కు 117 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (35; 94 బంతుల్లో 4×4)తో మూడో వికెట్ కు 82 పరుగులు జోడించాడు. అనంతరం ఆజింక్య రహానె (40 నాటౌట్: 81 బంతుల్లో 8×4)తో కలిసి రోజు ముగిసే వరకు మరో వికెట్ పడకుండా క్రీజులో నిలిచాడు. చతేశ్వర్ పుజారా మొదటి బంతికే డక్ అవుట్ అయ్యాడు. కాగా, ఆట ముగిసే సమయానికి భారత్ 272/3 స్కోర్ సాధించి పటిష్టస్థితిలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 1 =