దేశంలో 102 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Coronavirus Strain, Coronavirus Strain Cases, Coronavirus Strain in Andra Pradesh, Coronavirus Strain In India, Coronavirus Strain in Telangana, India New Coronavirus Strain, India New Coronavirus Strain Cases, Mango News, New coronavirus Strain, New Coronavirus Strain Cases, New Coronavirus Strain Cases in India, New Coronavirus Strain in India, New Coronavirus Strain Latest News, New Coronavirus Strain Live Updates, New Coronavirus Strain UK

దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (‌యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 102 కు చేరుకుంది. సోమవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 96 గా ఉండగా, కొత్తగా మరో ఆరుగురికి పాజిటివ్ గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 102 కి చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే గదిలో ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే వారి కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచామని, ఇతర నమూనాలపై కూడా వైరస్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని తెలిపారు.

మరోవైపు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్తరకం కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా యూకేలో రోజువారీగా 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యూకేతో పాటుగా ఇప్పటివరకు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ సహా 40 కి పైగా‌ దేశాల్లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =