దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో.. అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్ల విచారణ సమయంలోనే అక్రమాల స్థాయిని బట్టి.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో కేంద్రం ఐఐటీ మద్రాస్‌తో సాంకేతిక పరిశీలన చేయించి..ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఐఐటీ మద్రాస్ సాంకేతిక పరిశీలన రిపోర్టు ప్రకారం.. నీట్ పరీక్షలో ఎలాంటి మూకుమ్మడి అక్రమాలు అసలు జరగలేదని తేలింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. నీట్ పరీక్ష రాసిన కొంతమంది విద్యార్ధులకే ప్రత్యేకంగా లబ్ది కలిగేలా అసలు అక్కడ ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని మద్రాస్ ఐఐటీ వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐఐటీ మద్రాస్ నగరాల వారీగా, సెంటర్ల వారీగా కూడా పరీక్షలు జరిగిన తీరుపై అధ్యయనం చేసింది.
550-720 మధ్య స్కోరు సాధించిన కొంతమంది విద్యార్ధుల మార్కుల్లోనే ఈ పెరుగుదల కనిపించినట్లు మద్రాస్ ఐఐటీ నివేదిక తేల్చింది. ఇలా ఎక్కువ స్కోరు సాధించిన విద్యార్ధులు కూడా వేరు వేరు నగరాలకు చెందిన వారిగా గుర్తించింది. సిలబస్‌లో 25 శాతం తగ్గింపే దీనికి కారణమై ఉండొచ్చని మద్రాస్ ఐఐటీ నివేదిక పేర్కొంది. కాబట్టి మూకుమ్మడిగా నీట్‌లో అక్రమాలు జరిగినట్లు వస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని అభిప్రాయపడింది. దీంతో మద్రాస్ ఐఐటీ నివేదికపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపిన తర్వాత నీట్ కౌన్సెలింగ్ సహా రీటెస్ట్ పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE