మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, 2-1 తేడాతో సిరీస్‌‌ కైవసం

IND vs SL 3rd T20 Suryakumar Yadav Plays Key Role with 45-ball Century to Win India Series,India's victory over Sri Lanka, IND Vs SL First T20, Shivam Mavi 4 Wickets In Debut Match,Mango News,Mango News Telugu,Sri Lanka Vs India T20,Sri Lanka Vs India Live,India Vs Sri Lanka Today,Sri Lanka Vs India Live Score,Sri Lanka Vs India Squad,India Vs Sri Lanka Tickets,India Vs Sri Lanka 2023 T20,India Vs Sri Lanka Highlights,Sri Lanka Vs India,Sri Lanka Vs India Live Streaming,Sri Lanka Vs India 2021,Sri Lanka Vs India Test,Sri Lanka Vs India 2022,Sri Lanka Vs India Odi,Sri Lanka Vs India Live Match,Asia Cup Srilanka Vs India,Srilanka W Vs India W,Shivam Mavi Latest News and Updates,Shivam Mavi Total Wickets

ఇండియా, శ్రీలంక మధ్య హోరాహోరీగా సాగిన సిరీస్‌‌లో భారత్ ఘనవిజయం సాధించింది. రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో ఆఖరి టీ20 మ్యాచ్‌లో 2-1 తేడాతో 91 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌‌ని కైవసం చేసుకుంది. ఇక భారత్ మ్యాచ్‌ను గెలుచుకోవడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ కేవలం 45 బంతుల్లో సెంచరీ చేయడంతో శ్రీలంక ముందు టీమిండియా 229 పరుగుల భారీ స్కోర్ ఉంచింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌‌ కైవసం చేసుకుంది. కాగా తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, శ్రీలంకల చెరొకటి గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మెరుపు ఇన్సింగ్‌ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలవగా.. అక్షర్‌ పటేల్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సూర్యకుమార్‌కు ఇది టీ20ల్లో మూడో సెంచరీ కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. మిగిలినవారిలో శుభ్‌మన్‌ గిల్ 46 పరుగులు, రాహుల్‌ త్రిపాఠి 35 పరుగులు, అక్షర్‌ పటేల్ 21 పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో మదుశంక రెండు, రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో షనక (23), ధనంజయ (22), అసలంక (19) భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. హార్దిక్, ఉమ్రాన్‌ మాలిక్, చాహల్ 2 వికెట్ల చొప్పున, అక్షర్‌ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

స్కోరు బోర్డు

భారత్: ఇషాన్ కిషన్ (1), శుభమన్ గిల్ (46), రాహుల్ త్రిపాఠి (35), సూర్యకుమార్ యాదవ్ (112*), హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా (4), అక్షర్ పటేల్ (21*). ఎక్స్‌ట్రాలు (5), మొత్తం 20 ఓవర్లలో 228/5.

శ్రీలంక: నిస్సంక (15), కుశాల్ మెండిస్ (23), అవిష్క ఫెర్నాండో (1), ధనంజయ డిసిల్వా (22), చరిత్ అసలంక (19), దాసున్ షనక (23), హసరంగా డి సిల్వా (9), చమిక కరుణరత్నే (0), మహేశ్ తీక్షణ (2), కసున్ రజిత (9*), దిల్షాన్ మధుశంక (1). ఎక్స్‌ట్రాలు (13), మొత్తం 16.4 ఓవర్లలో 137 ఆలౌట్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =