టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం ఉదయం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ ఘనవిజయం సాధించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు దూసుకెళ్లింది. ఒలింపిక్ చరిత్రలో భారత మహిళల హాకీ జట్టు తొలిసారిగా సెమీఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు మ్యాచ్ లో భారత క్రీడాకారిణి గుర్జీత్ కౌర్ చేసిన ఏకైక గోల్, గోల్ కీపర్ సవిత పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక బుధవారం నాడు జరిగే సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు అర్జెంటైనాతో తలపడనుంది. ఈ కీలక పోరులో విజయం సాధిస్తే సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశముంది.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కూడా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం క్వార్టర్స్ ఫైనల్స్ లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్‌ప్రీత్ సింగ్, గుర్జత్ సింగ్, హార్దిక్ సింగ్ తలోక గోల్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒలింపిక్స్ లో 1980లో చివరిసారి స్వర్ణ పతకం సాధించాకా, 41 ఏళ్ల అనంతరం మళ్ళీ భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ కు చేరుకుంది. ఆగస్టు 3, మంగళవారం నాడు సెమీ ఫైనల్ లో బెల్జియంతో భారత్ జట్టు తలపడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ