ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…

bcci, BCCI Announce India T20I Squads, BCCI Announces Squad For India’s Tour Of Australia, india match schedule 2020, India name squads for Australia tour, India T20, India Tour of Australia 2020, ODI and Test Squads for Tour of Australia, Team India T20I, Team India T20I ODI and Test Squads

నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో కూడా విశ్రాంతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో వన్డేలు, టీ20ల్లో కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌ గా వ్యవరించనున్నారు. ఇక వీకెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్‌కు వన్డే, టీ20 లలో చోటు దక్కలేదు. కమలేష్ నాగర్‌కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్ మరియు టి.నటరాజన్ నలుగురు అదనపు బౌలర్లుగా భారత బృందంతో కలిసి ప్రయాణించనున్నారు. అలాగే రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మల పురోగతిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.

భారత టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ సిరాజ్.

భారత వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌.

భారత టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 1 =