నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డి ఖరారు

CM KCR Announced Padi Kaushik Reddy Name for MLC under Governor Quota

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కౌశిక్‌ రెడ్డి పేరును కేబినెట్ సిఫారసు చేసింది. ఈ మేరకు సంబంధిత ఫైల్ ను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. గవర్నర్ ఆమోదం అనంతరం కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీగా నియమించబడి, ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జూలై 21న తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స‌మ‌క్షంలో కౌశిక్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చిన కౌశిక్‌ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌ కు హామీ ఇస్తున్నానని, ఆయన భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి పేరును నిర్ణయించినట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =