టోక్యో పారాలింపిక్స్: కృష్ణ నాగర్‌ కు స్వర్ణం, సుహాస్‌ యతిరాజ్‌ కు రజతం

Tokyo Paralympics : Krishna Nagar Wins Gold, Suhas Yathriraj Wins Silver Medal in Badminton

టోక్యో పారాలింపిక్స్ లో బాడ్మింటన్ లో భారత్ పతకాల వేట కొనసాగింది. ఆదివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఆదివారం ఉదయం బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6 విభాగంలో కృష్ణ నాగర్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై 21-17, 16-21, 21-17 తేడాతో కృష్ణ నాగర్‌ విజయం సాధించి భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతాకాన్ని చేర్చాడు. అలాగే బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. ఫైనల్‌ లో ప్రపంచ నంబర్‌ వన్‌, ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్‌ మజుర్‌ 21-15, 17-21, 15-21 తో సుహాస్‌ యతిరాజ్‌ పై గెలుపొందాడు. దీంతో సుహాస్‌ యతిరాజ్‌ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పారాలింపిక్స్-2020లో భారత్ మొత్తం పతకాలు సంఖ్య 19 కు (ఐదు స్వర్ణం, ఎనిమిది రజతం, ఆరు కాంస్యాలు) చేరుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ