రేవ్ పార్టీలో పట్టుబడ్డ టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరు?

100 people caught in Bangalore,Tollywood celebrities caught at a rave party?,Tollywood celebrities, rave party,Hema, kakani Govardhan Reddy
100 people caught in Bangalore,Tollywood celebrities caught at a rave party?,Tollywood celebrities, rave party,Hema, kakani Govardhan Reddy

తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందిలో  కొంతమంది లీడర్లు, తెలుగు పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు బెంగళూరులో కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని ఫామ్‌హౌస్‌పై..ఈ తెల్లవారుజామున సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ దాడి చేసింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు కూడా ఈ  పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. క్రైమ్ బ్రాంచ్ చేసిన తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం మరోసారి  సంచలనంగా మారింది.

17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లుతో పాటు కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ రేవ్ పార్టీకి బెంగళూరుకి చెందినవారితో పాటు ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి సెలబ్రెటీలు పైగా హాజరవగా..ఇందులో  25 మందికి పైగా యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో  జీఆర్  ఫామ్‌హౌస్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జీఆర్ ఫామ్ హౌస్  అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌‌ అని.. కాన్ కార్డ్ యజమాని అయిన గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్  పార్టీని హోస్ట్ చేసినట్లు అక్కడివారు చెబుతున్నారు.

అయితే హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటని ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఓ వ్యక్తి పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా  ప్లాన్ చేయడం.. 100 మంది  VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా వార్తలు రావడంతో  దీనిపై బెంగళూరు ఎలక్ట్రానికిక్‌ సిటీ పోలీసులు  పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు.  ఇక ఇప్పటికే సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌  ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.

జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన  రేవ్‌ పార్టీకి హైఎండ్‌, పోష్‌ కార్లు చాలా వచ్చాయని.. కానీ అందులో ఉన్న  ఓ బెంజ్‌ కార్‌‌పై ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఈ కారుతో తనకెలాంటి  సంబంధం లేదని కాకాణి గోవర్దన్ రెడ్డి తెలుగు మీడియా ద్వారా స్పష్టం చేశారు. అసలు ఆ కారు తనది కాదని.. తన పేరును ఇలా ఎవరో వాడుకుంటున్నారని ఆయన వివరించారు.

రేవ్ పార్టీకి  టాలీవుడ్‌కి చెందిన కొంతమంది సెలబ్రెటీలు హాజరవడంతో వారిని  పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే  టాలీవుడ్ సపోర్టింగ్ యాక్టర్ హేమ పేరు కన్నడ మీడియాలో  వినిపిస్తోంది. అయితే  బెంగళూరు రాలేదని తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు  హేమ క్లారిటీ ఇచ్చారు. రేవ్‌ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ మీడియాలోనూ తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో  వచ్చిన వార్తల్ని ఆమె ఖండించారు. మరి ఇందులో ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తాయో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ