సామాన్యులకు ఈ మధ్యన తరచూ టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ధర రూ.100 చేరువవ్వడంతో వంటకాల్లో ఇక టమాటాకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కూరల్లో రుచిని అమాంతం పెంచే టమాట అంటే చాలామంది ఇష్టపడతారు. కొంతమంది అయితే టమాట కాంబినేషన్ లేకుండా వంటే పూర్తవనట్లు భావిస్తారు.అలా అని రోజురోజుకు పెరుగుతున్న ధరలలో టమాటను చూస్తూనే షాక్ కొట్టినట్లు ఫీలవుతున్నారు.
రైతుబజార్లలో నిర్ణయించిన ధరకు మించి టమాటాలను విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో 51 రూపాయలుగా అధికారులు నిర్ణయిస్తే.. 70 రూపాయలకు తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ రేటుకు పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. మంచివి కావాలంటే 70 రూపాయలు ఇచ్చుకోవాల్సిందే అంటున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయాలు సాగిస్తున్నారు.
మొన్నటివరకూ ప్రతిరోజూ హైదరాబాద్‌లో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికి అందాక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీంతో టమాట డిమాండ్ పెరిగి ధర కొండెక్కింది. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో టమాట ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. శివార్లలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా టమాటలు పెద్దగా ఇక్కడ మార్కెట్లలోకి రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమాటా దిగుబడి కూడా 60 శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE