డిసెంబర్ చివరి వారంలో ఏపీ, తెలంగాణల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శ్రీశైలం, రామప్ప ఆలయాల సందర్శన

President Droupadi Murmu To Visit Srisailam and Ramappa Temple on Dec 26th and 28th During Telugu States Tour,President Draupadi Murmu Ap Visit,President Draupadi Murmu Telangana Visit, President Draupadi Murmu December Tour,President Murmu Visit Srisailam, President Murmu Visit Ramappa Temples,Mango News,Mango News Telugu,President Draupadi Murmu Tour,President Of India,Draupadi Murmu Speech,India President Droupadi Murmu,Shrimati Draupadi Murmu,Draupadi Murmu News,Draupadi Murmu Today News,Draupadi Murmu Latest News In English,Draupadi Murmu Tour,President Draupadi Murmu News and Live Updates

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె ఏపీ, తెలంగాణల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము డిసెంబర్ 26న నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ప్రసాదం పథకం’ (ప్రసాద్‌ స్కీమ్‌) ప్రాజెక్టును ఆమె ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద రూ.43 కోట్లతో యాత్రికుల కోసం శుద్ధి చేసిన తాగునీటి పథకం, లైటింగ్ వ్యవస్థ, రోడ్ల విస్తరణ సహా పలు సౌకర్యాలను కొండపైన నిర్మించారు. ఇక డిసెంబర్ 28న రాష్ట్రపతి తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కించుకున్న ప్రముఖ శిల్ప కళాధామం రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 30 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + fifteen =