ఆల్కలైన్‌ వాటర్‌ నల్లగా ఎందుకుంటాయి? సెలబ్రెటీలు మాత్రమే తాగే ఈ వాటర్ అంత మంచివా?

Many Celebrities Like Cricketer Virat Kohli or Heroine Kajal Why They Prefer Black Alkaline Water,Many Celebrities Like Cricketer Virat Kohli,Why They Prefer Black Alkaline Water,Many Celebrities Like Heroine Kajal,Heroine Kajal Prefer Black Alkaline Water,Virat Kohli Prefer Black Alkaline Water,Mango News,Mango News Telugu,Virat Kohli to Malaika Arora,Many Celebrities Drinking Black Water,Alkaline Water, Why is alkaline water black, Is this water that only celebrities drink,Alkaline black water pH level,Black Alkaline Water Latest News,Black Alkaline Water Latest Updates,Celebrities Latest News and Updates,Celebrities Prefer Black Alkaline Latest News

క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి హీరోయిన్ కాజల్ వరకూ ఏ సెలబ్రెటీల చేతిలో చూసినా.. నల్లనీళ్ల బాటిలే కనిపిస్తుంది. మొదట్లో విచిత్రంగా చూసినా.. రానురాను జనాలు కూడా అర్ధం చేసేసుకున్నారు. ఈ కాస్ట్‌లీ వాటర్.. సెలబ్రెటీలు మాత్రమే తాగుతారన్న ఒపీనియన్‌కు వచ్చేసారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఓ అనుమానం అయితే అందరిలో పీకుతుంది. అసలు ఇంత నల్లగా ఉన్నవాటర్‌లో ఆ కలర్ రావడానికి ఏం కలుపుతారు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంటాయి. సెలబ్రెటీలంతా ఆల్కలైన్ వాటర్ మంత్రమే ఎందుకు జపిస్తున్నారంటూ బోలెడు ప్రశ్నలు మైండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి.

నిజానికి ఆల్కలైన్‌ వాటర్‌ మినరల్‌ వాటర్‌ కంటే రుచిగా ఉండటంతో పాటు.. ఆరోగ్యకరం కూడా అట. అందుకే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్‌ స్టార్స్ ఆల్కలైన్ వాటర్ లేకుండా అడుగు కూడా బయట పెట్టడం లేదు.కాకపోతే నీళ్లంటే తెల్లగా ఉంటాయని అందరికీ తెలిసినా నీళ్లు నల్లగా కూడా ఉంటాయని ఆల్కలైన్ వాటర్ చూపించింది. మామూలుగానే నీళ్లను మించిన ఔషధం లేదని అందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని తరచూ చెబుతూనే ఉంటారు. బాడీ వ్యర్థాలను వదిలించుకోవాలన్నా.. మల బద్ధకాన్ని తగ్గించుకోవాలన్నా.. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా, కిడ్నీలు శుభ్రపడాలన్నా అన్నిటికీ నీళ్లు ఎక్కువగా తాగడమే మందు అని చాలామందికి ఇప్పటికే అర్ధమయింది. అంతెందకు నీళ్లు ఎక్కువగా తాగేవారిలో చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఫేస్‌లో కూడా షైనింగ్ ఉంటుంది. అందుకే అన్ని రకాలుగానూ ఎక్కువ నీళ్లు తాగడం అనేది మంచిదే అంటారు ఆరోగ్య నిపుణులు.

ఒకప్పుడు పంపు దగ్గర నీళ్లు తాగిన మనం ఇప్పుడు ఆర్వో వాటర్, మినరల్ వాటర్ అంటూ నీళ్లను కొనుక్కుని తాగాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేశాం. కారణం ఏదయినా పల్లెటూళ్లలోనూ క్యాన్ వాటర్ కొని తాగడమే మంచిదన్న అభిప్రాయానికి అంతా వచ్చేశారు. ఒకప్పుడు నీళ్లు ఉచితంగా దొరికేవి కానీ.. తర్వాత మాత్రం కొనుక్కుని తాగే స్టేజ్‌లోకి వెళ్లిపోయాం. ఈ మధ్య ఈ లిస్టులోకి ఆల్కలైన్ వాటర్ వచ్చేసింది . కాకపోతే ఇది ఓన్లీ సెలబ్రెటీలకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదయిన వాటర్‌గానే ముద్ర వేసుకుంది. నిజానికి భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజ వనరులతో జోడించి.. మరీ ఈ ఆల్కలైన్ వాటర్‌ను ఎనర్జిటిక్‌గా చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. ప్రాసెస్‌కు ఎక్కువ ఖర్చు అవడంతోనే ఇది ఖరీదయిన వాటర్‌గా మాత్రమే ఉండిపోయిందని అంటోంది.

మామూలుగానే నీటి నాణ్యతను పీహెచ్‌ స్థాయితో కొలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. నీళ్లు ఎప్పుడూ పీహెచ్‌ స్థాయి 7 ని దాటితేనే నాణ్యమైన నీటి కింద లెక్క వేస్తారు. అలా చూసుకుంటే ఈ ఆల్కలైన్ బ్లాక్‌ వాటర్‌ పీహెచ్‌ స్థాయి 8.5 ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. దీనివల్ల ఆల్కలైన్ వాటర్‌కు ఔషధ గుణం యాడవుతుందట. ఆల్కలైన్ వాటర్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయని, అధిక కొవ్వును కరిగించేస్తాయని తమ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఈ కంపెనీలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో యాసిడ్‌ లెవెల్స్‌ను తగ్గించి.. బోన్స్‌కు బలాన్నిస్తాయని అనేక అధ్యయనాలు తెలిపాయని ఆధారాలు కూడా చూపిస్తున్నాయి. సాధారణంగా మనం రెగ్యులర్‌గా వాడే నీటితో పోలిస్తే.. ఈ నీళ్లు ఎక్కువ కాలం శరీరాన్ని తేమగా ఉంచుతాయట ఆల్కలైన్ వాటర్. అంతేకాదు ఈ బ్లాక్‌ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయనే వాదన కూడా ఉంది.

ఆల్కలైన్ వాటర్‌ను భోజనం తర్వాత తాగితేనే.. ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా వంటబడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సహజ ఖనిజాల ప్రభావంతోనే ఆల్కలైన్ వాటర్‌కు నల్లరంగు వస్తుందట. కానీ ఈ నీళ్లను ఎక్కువగా తాగితే.. అంటే తాగవలసిన మోతాదు కంటే మించి తాగితే.. వికారం,వాంతులు వంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందట. అందుకే బ్లాక్‌ వాటర్‌ ఎంత తాగాలి అనేది ఆ వ్యక్తుల నీటి అవసరాలను బట్టి మారుతూ ఉంటుందని.. అది నిపుణుల పర్యవేక్షణలో చూసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =